1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Temple Priests Salaries Hiked

తెలంగాణలోని అర్చకులకు గుడ్ న్యూస్

kcrao
తెలంగాణలోని అర్చకులకు ఆ రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అర్చకులకు ఇకపై రూ.10 వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు జీవో కూడా జారీ అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అర్చకుల వేతనం రూ.2,500 మాత్రమేనని, దాన్ని సీఎం కేసీఆర్ రూ.6 వేలకు పెంచారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. 
 
గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడా వేతనాన్ని రూ.10 వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ధూప దీప నైవేద్య పథకం కింద ఇప్పటివరకు తెలంగాణలో అర్చకుల గౌరవం వేతనం రూ.6 వేలుగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 6,541 ఆలయాలు ధూప దీప నైవేద్య పథకం పరిధిలో ఉన్నాయని మంత్రి చెప్పారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
నాగ్‌పూర్‌ మెట్రోలో ఫ్యాషన్ షో.. కదులుతున్న రైలులో క్యాట్ వాక్