ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (20:13 IST)

మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించిన పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా

Parineethi Chopra
Parineethi Chopra
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఇరువురు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి అర్చకుల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
పరిణీతి పింక్ చీరలో కూర్చొని కనిపించగా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు పసుపు ధోతీ, మెడలో ఎరుపు దుపట్టాలో కనిపించారు. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఉజ్జయినిలోని మహాకాల్ సందర్శనకు ముందు, ఈ జంట అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు కూడా వెళ్లారు. గురుద్వారాలో ప్రార్థనలు చేశారు.