బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (17:23 IST)

బెదరులంక 2012 విజయం కాన్ఫిడెన్స్ ఇచ్చింది : హీరో కార్తికేయ

Karthikeya, ravi, clocks
Karthikeya, ravi, clocks
కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'బెదురులంక 2012'. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. 
 
హీరో కార్తికేయ మాట్లాడుతూ ''మా సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసిన, మాకు ఎంతో మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు థాంక్స్. సక్సెస్ వచ్చినప్పుడు, మనం అనుకున్న సినిమా హిట్ అయినప్పుడు... సినిమాలు వస్తాయి. మంచి కథలు వస్తాయి. అవి పక్కన పెడితే... 'బెదరులంక 2012' విజయం జీవితంలో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ కథ విన్న తొలి రోజు నుంచి ఏది అయితే కథలో వర్కవుట్ అవుతుంది? ప్రేక్షకులకు నచ్చుతుంది? అనుకున్నానో... వాటికి మంచి పేరు వచ్చింది. సెకండాఫ్ అంతా నవ్వుతూ ఉన్నామని, చివరి 45 నిమిషాలు నవ్వుతూనే ఉన్నామని ముక్త కంఠంతో అందరూ చెబుతున్నారు. సీరియస్ విషయాన్ని వినోదంతో చెప్పడం ఇంతకు ముందు చూడలేదు. అటువంటి కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపై మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను థియేటర్లకు వెళ్లాను. హౌస్ ఫుల్ కావడం చూసి సంతోషం వేసింది. దర్శకుడు ఇతనే అని క్లాక్స్ ని పరిచయం చేయగా... అందరూ  క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు మెం రిలాక్స్డ్ గా ఉన్నాం. నాకు ఈ సినిమా ఇచ్చిన నిర్మాత బెన్నీ గారికి థాంక్స్. మా టీమ్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. నేహా శెట్టి ఒక ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల ఇక్కడికి రాలేకపోయింది. మా ట్రైలర్‌ విడుదల చేసిన రామ్‌ చరణ్‌ గారికి థాంక్స్‌. నా ఇన్స్‌పిరేషన్‌, ఈ సినిమాలో ఆయన పేరు శివ శంకర వరప్రసాద్‌ అని పెట్టుకున్నా. నాకు ఎంతో సపోర్ట్‌ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు థాంక్స్‌'' అని అన్నారు.  
 
బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ''మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు, మా సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మా సినిమా విజయవంతం కావడం సంతోషంగా ఉంది'' అని అన్నారు.   
 
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ''సక్సెస్ అయ్యాక ఏం మాట్లాడాలో నాకు తెలియదు. నా కథను నమ్మిన బెన్నీ గారికి, కార్తికేయ గారికి, మా టీం అందరికీ థాంక్స్. సాయి ప్రకాష్, సన్నీ కూరపాటి... మా సినిమాటోగ్రాఫర్లకు, మణిశర్మ గారికి కూడా థాంక్స్. మా సినిమా 'బెదురులంక 2012'లో సెకండాఫ్ బావుందని, నవ్వుతున్నారని అంతా చెబుతున్నారు. ఈ విజయం వెనుక టెక్నీషియన్లు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా థాంక్స్. ఇప్పుడు స్క్రీన్స్ పెంచుతున్నారని చెబుతున్నారు. మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. కార్తికేయ, నేహా శెట్టి నాకు ఫ్రెండ్స్. వాళ్ళతో పని చేయడం కంఫర్టబుల్. నాకు తొలి అవకాశం ఇచ్చిన మా నిర్మాత బెన్నీ గారికి థాంక్స్'' అని అన్నారు. 
 
'ఆటో' రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ''నా జీవితంలో ఫస్ట్ సక్సెస్ మీట్ ఇది. నేను చాలా హిట్ సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేశా. పోస్టర్ లో నా ఫోటో కూడా ఉన్న సినిమా ఇది. దర్శకుడు క్లాక్స్ నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ కోసం వెంటాడతా. ట్రైలర్ విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్తికేయ బాగా చేశారు. ఆయన ఫ్రెండ్లీ హీరో. ఆర్టిస్టులకు సపోర్ట్ చేస్తూ బాగా మాట్లాడతారు. ఇంత మంచి సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసినందుకు సంతోషంగా ఉంది'' అని అన్నారు.