సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2023 (13:59 IST)

సింహాచలం హుండీలో భారీ మొత్తం.. వంద కోట్ల చెక్కు.. ఏం జరిగిందంటే?

cheque
సింహాచలం హుండీలో భారీ మొత్తానికి సంబంధించిన చెక్కు కనిపించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. వంద కోట్ల రూపాయలు రావడంతో ఉత్కంఠ నెలకొంద. అయితే దేవస్థానం అధికారులు ఏదో తప్పుగా రాసి వుంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా ఈ చెక్కును వెంటనే బ్యాంకుకు పంపారు. దాతను గుర్తించడానికి ఆలయం ఇప్పుడు బ్యాంకుకు లేఖ రాయాలని పరిశీలిస్తోంది. ఈ చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొనే అవకాశం ఉంది.
 
విశాఖ సమీపంలోని సింహాచలం కొండపై కొలువైన సింహాచలం అప్పన్నస్వామి ఉత్తరాంద్ర వాసులకు ఆరాధ్య దైవం. వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు స్వామి వారి హుండీలో ఓ చెక్ వేశాడు. బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే పేరుతో వేసిన ఆ చెక్ మీద వందకోట్లు రాసి ఉంది. అయితే ఈ చెక్ చూసి షాకైన అప్పన్న ఆలయ నిర్వాహకులు షాకయ్యారు. 
 
సదరు భక్తుడి ఖాతాలో కేవలం 17 రూపాయలే ఉన్నాయంటూ బ్యాంక్ అధికారులు చెప్పడంతో సింహాచలం ఆలయ అధికారులు కంగుతున్నారు. మరోవైపు భక్తుడు రాధాకృష్ణ అడ్రస్ వివరాలు కోరుతూ బ్యాంకుకు లేఖ రాయాలని దేవస్థానం వర్గాల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.