నాగ్‌పూర్ మెట్రోలో ఫ్యాషన్ షో.. కదులుతున్న రైలులో క్యాట్ వాక్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆగస్టు 28వ తేదీన కదులుతున్న మెట్రోలో ఫ్యాషన్ షో జరిగింది. దీన్ని చూసిన ప్రయాణీకులు షాక్ అయ్యారు. వారాంతం కావడంతో ప్రయాణీకులతో రద్దీగా వున్న మెట్రోలో ఫ్యాషన్ షో జరిగింది.
వివిధ రకాల దుస్తులు ధరించి అలా కదిలే రైలులో ఫ్యాషన్ షో నిర్వహించడం చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఈ ఫ్యాషన్ షోలో రెండు నుంచి 50 సంవత్సరాల వయస్సున్న వారు పాల్గొన్నారు.
నాగ్‌పూర్ మెట్రో సెలెబ్రేషన్ ఆన్ వీల్ అనే పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద వివిధ సంస్థలు వేడుకలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి.