శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (10:25 IST)

నోయిడాలోని ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. మోడల్ మృతి

Noida
Noida
ఢిల్లీ నోయిడాలోని ఫిల్మ్ సిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. లైటింగ్ పోల్ కుప్పకూలి మోడల్ మృతి చెందింది. లైటింగ్ పోల్ కుప్ప‌కూలి మోడల్‌పై పడడంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరో మోడల్‌కు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. 
 
షో కొనసాగుతున్న సమయంలో లైటింగ్‌ ట్రస్‌ విరిగి మోడల్ వంశికపై పడిపోయింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
 
సెక్టార్-20 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిల్మ్ సిటీలో ఉన్న స్టూడియోలో ఫ్యాషన్ షో నిర్వహించారు. మృతురాలిని గ్రేటర్‌ నోయిడా వెస్ట్‌లోని దివ్యాన్ష్ ఫ్లోరా హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటున్న 24 ఏళ్ల మోడల్ వంశిక చోప్రాగా గుర్తించారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు నిర్వాహకులతో పాటు లైటింగ్‌ ట్రస్‌ ఏర్పాటు చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచార‌ణ జ‌రుపుతున్నారు.