శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (10:12 IST)

వర్ధమాన మోడల్స్‌ను బలవంతంగా వ్యభిచార కూపంలోకి..?

వర్ధమాన మోడల్స్‌ను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్న భోజ్‍పురి నటి సుమన్ కుమారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. హై ప్రొఫైల్ రాకెట్‌‌కు సంబంధించిన సమాచారం రావడంతో.. ఓ హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. 
 
ఈ ఘటనలో నిందితురాలిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మఫ్టీలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నటి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉంది. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న మిగతా వారిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.