సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (22:55 IST)

మహారాష్ట్రలో మూడవ బహిరంగ సభ.. బీఆర్ఎస్ హ్యాపీ

kcrcm
తెలంగాణలోని అధికార భారత రాష్ట్ర సమితి (BRS) మహారాష్ట్రలో మూడవ బహిరంగ సభకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 24న ఔరంగాబాద్‌లోని ఆమ్‌ఖాస్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ ఈవెంట్‌కి ముఖ్యంగా రైతు సంఘం నుండి ఇంకా పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని భావిస్తున్నారు. 
 
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఔరంగాబాద్ పోలీసులు ఆమ్‌ఖాస్ గ్రౌండ్స్‌లో సమావేశానికి అనుమతి నిరాకరించారు. దీంతో బిఆర్‌ఎస్ నాయకులు ప్రత్యామ్నాయ స్థలం కోసం తర్జనభర్జనలు పడ్డారు. సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి పోలీసుల నిర్ణయాన్ని తెలియజేశారు. 
 
మహారాష్ట్ర పోలీసుల నుంచి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, BRS పట్టుదలతో ఉంది. ప్రణాళిక ప్రకారం సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంది. నివేదికల ప్రకారం, ఔరంగాబాద్‌లోని మిలింద్ కాలేజీకి సమీపంలో ఉన్న ప్రదేశానికి స్థలాన్ని మార్చాలని పోలీసులు సూచించారు. దీంతో బీఆర్ఎస్ ఉత్సాహంగా వుంది.