1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (13:44 IST)

నాచారంలో వారం రోజుల్లో మరో అగ్నిప్రమాదం.. ఆస్తి బుగ్గిపాలు

fire accident
హైదరాబాద్ నగరంలోని నాచారంలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. గత వారం రోజుల్లో రెండో ప్రమాదం. ఇటీవల జేపీ పెయింట్స్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన మరిచిపోకముందే నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. మల్లాపూర్ పారిశ్రామికవాడలోని ఏకశిలా రసాయన కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. 
 
దీంతో అందులో ఉన్న కార్మికులు భయభ్రాంతులకుగురై ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో ఫ్యాక్టరీ నుంచి విష వాయువులు వెలువడటంతో పలువురు కార్మికులు అస్వస్థతకు లోనయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది... హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అస్వస్థతకు గురైన కార్మికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాయి. 
 
అయితే, నాచారంలో వారం రోజులు తిరగకముందే మరో అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. వరుస అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ, ఈ ప్రమాదాల కారణంగా విషయవాయువులు వెలువడుతున్నప్పటికీ అధికారులు, పోలీసులు మాత్రం ఏమాత్రం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.