కారు టైరు పేలి మాజీ ఎమ్మెల్యే దుర్మణం
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కారు టైరు పేలపోవడంతో కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. హైదారాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా మార్గమధ్యంలో టైరు పేలిపోయింది. దీంతో కారు బోల్తాపడింది. ఈ ఘటన బీచుపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం ధాటికి ఆమె ప్రయాణిస్తున్న ఫార్చూనర్ వాహనం పల్టీ కొట్టి నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలపాలైన నీరజారెడ్డిని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో ఆమె తల, ఇతర శరీర భాగాలకు తీవ్రమైన దెబ్బలు తగలడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
నీరజారెడ్డి ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత రెండేళ్లకే ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీని కూడా వీడి వైకాపాలో చేరారు. అక్కడ ఇమడలేక భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. ఈమె భర్త పాటిల్ శేషిరెడ్డి గతంలోనే మరణించారు. ఆయన పత్తికొండ ఎమ్మెల్యేగా పని చేశారు. నీరజారెడ్డి మృతిపట్ల బీజేపీ నేతలు, శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.