శనివారం, 12 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మార్చి 2023 (10:57 IST)

అమెరికాలో టోర్నడో బీభత్సం - 23 మంది మృత్యువాత

tornado storm
అగ్రరాజ్యం అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. మిసిసిపి రాష్ట్రంలో సంభవించిన భారీ టోర్నడో ఆ రాష్ట్రంలో అల్లకల్లోలంతో పాటు అపార నష్టాన్ని మిగిల్చింది. దీని కారణంగా ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. 
 
ఇది రాత్రివేళ సంభవించడంతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ఈ రాష్ట్ర ప్రజల పాలిట ఈ టోర్నడోలు ఒక పీడకలా మారాయి. దీంతో ప్రాణ నష్టంతో ఆస్తి నష్టం అపారంగా కలుగుతుంది. అనేక భవనాలు కుప్పకూలిపోయారు. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ టోర్నడో కారణంగా ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నామరూపాలు లేకుండా పోయాయి. 
 
ప్రకృతి విలయతాండవంతో ఎక్కడ చూసినా శిథిలాల గుట్టలు, విరిగిపడిన చెట్లు, ధ్వంసమైన కార్లు, వాహనాలు, తెగిపోయిన విద్యుత్, కూలిపోయిన విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. విద్యుత్ స్తంభించడంతో లక్షలాది గృహాల్లో చీకటి అలముకుంది. కొన్ని ప్రాంతాల్లో ఫుట్‌బాల్ సైజుతో కూడి వడగళ్లు కూడా పడినట్టు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. అర్థరాత్రి ఉన్నట్టుండి గృహాలు కూలిపోవడంతో వాటి శిథిలాల కింద అనేద మంది ప్రజలు చిక్కుకున్నారు.