గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (15:11 IST)

లాస్ ఏంజెలెస్‌ వీధుల్లో నగ్నంగా సంచరిస్తున్న నటి...

amanda bynes
హాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఒకపుడు ప్రముఖ నటిగా ఉన్న అమండా బైన్స్ పరిస్థితి ఇపుడు మరింత దయనీయంగా మారిపోయింది. ఆమె మానసికస్థితి ఏమాత్రం బాగోలేదు. దీంతో ఆమె లాస్ ఏంజెలెస్ వీధుల్లో నగ్నంగా తిరుగుతుంది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంది. గతంలో తన పక్కింటికి నిప్పు అంటించడం, తన పెంపుడు కుక్కను చంపాలని ప్రయత్నించడం వంటి చర్యలకు పూనుకుంది. కానీ, ఇపుడు ఒంటిపై నూలుపోగు లేకుండా ఎల్ఏ వీధుల్లో తిరుగుతూ కనిపించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
అమండా బైన్స్‌కు ప్రస్తుతం 36 యేళ్లు. గత కొన్ని రోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె కారులో ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదుగానీ, లాస్ డౌన్‌టౌన్ వీధిలో తన కారును ఆపి ఒంటిపై బట్టలు లేకుండా కారు దిగి అక్కడ కొంతసేపు సంచరించి అటుగా వచ్చిన పాదాచారులపై నోరుపారేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.