శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

గతుకుల రోడ్డు - ఆటో బోల్తా బడి ఆరుగురు మృతి

road accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో పాటు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గతుకుల రోడ్డులో ఆటో బోల్తాపడింది. శ్రీ సత్యసాయి జిల్లాలో బొలెరో, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బత్తలపల్లి మండలం పోట్లపర్రి వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటన స్థలంలో ఐదుగురు చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు వదిలారు. ధర్మవరం నుంచి బత్తలపల్లి వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.