ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (12:35 IST)

ఏపీ బడ్జెట్ మొత్తం లెక్క రూ.2,79,279 కోట్లు - అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బుగ్గన

buggana
ఏపీ మొత్తం బడ్జెట్ రూ.2,79,279 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విత్తమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన తర్వాత విత్తమంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకుముందు.. శాసనసభలో మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, కుతూహలమ్మ, పాతపాటి సర్రాజుల మృతికి అసెంబ్లీ నివాళులు అర్పించింది. ఆ తర్వాత బడ్జెట్ పద్దును మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. 
 
పోతన పద్యంతో, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వ్యాఖ్యలతో తన బడ్జెట్‌ ప్రసంగాన్ని మొదలుపెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్.. ఈ సందర్భంగా బడ్జెట్‌ రూపకల్పనలో భాగస్వాములైన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఆటుపోట్లను అధిగమించామని మంత్రి బుగ్గన అన్నారు. ఈ బడ్జెట్‌ సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించామన్నారు. 
 
బడ్జెట్‌ కేటాయింపులు ఇలా.. 
సెకండరీ విద్యకు రూ.29,690.71 కోట్లు
వైద్యారోగ్య శాఖకు రూ.15,882.34 కోట్లు
పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి రూ.15,873.83 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.11,589.48 కోట్లు
రవాణా, ఆర్‌ అండ్‌ బీ రూ.9,118.71 కోట్లు
విద్యుత్‌ శాఖకు రూ.6,546.21 కోట్లు
ఎస్సీ కార్పొరేషన్‌ రూ.8,384.93 కోట్లు
ఎస్టీ కార్పొరేషన్‌ రూ.2,428 కోట్లు
బీసీ కార్పొరేషన్‌కు రూ.22,715 కోట్లు
ఈబీసీ కార్పొరేషన్‌కు రూ.6,165 కోట్లు
కాపు కార్పొరేషన్‌కు రూ.4,887 కోట్లు
క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ రూ.115.03 కోట్లు