సంబంధిత వార్తలు
యజమాని మృతి.. 3నెలలైనా ఆస్పత్రి నుంచి కదలని శునకం.. చివరికి?
Dog
యజమాని కోసం మూడు నెలలైనా.. ఆయన ఇకలేరనే విషయం గ్రహించకుండా యజమాని కోసం నిరీక్షిస్తోంది. ఈ ఘటన చూపరులను కంట తడి పెట్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు సేలంకు చెందిన మోహన్ కుమార్ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన మోహన్.. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు.
అయితే యజమాని లోపలే వున్నారని భావించిన మృతుడి పెంపుడు శునకం మూడు నెలలుగా ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. ఆస్పత్రి సిబ్బంది అక్కడ నుంచి పంపేసినా.. మళ్లీ అదే స్థలానికి చేరుకుంటోంది. దీంతో ఆస్పత్రి సిబ్బందే ఆ శునకానికి ఆహారం అందిస్తున్నారు.
