శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం... నలుగురు భారతీయులతో సహా 16 మంది మృతి

fire accident
దుబాయ్‌లోని అల్ రస్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులతో సహా మొత్తం 16 మంది మృత్యువాతపడ్డారు. ఈ మంటల్లో కాలిపోయిన వారిలో కేరళ, తమిళనాడు వాసులతో పాటు పాకిస్థాన్, నైజీరియా ప్రజలు ఉన్నారు. భవన నిర్మాణంలో తగిన రక్షణ చర్యలు పాటించకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో సంభించినట్టు గల్ఫ్ న్యూస్ తెలిపింది. 
 
భవనంలోని నాలుగో అతస్తులో సంభవించిన మంటలు క్రమంగా ఇతర చోట్లకు కూడా వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దుబాయ్ సివిల్ ఢిపెన్స్ హెడ్‌క్వార్టర్స్‌ సిబ్బంది నిర్వాసితులను అక్కడకి నుంచి తరలించారు. 
 
ఈ ఘటనలో మరణించిన నలుగురు భారతీయుల్లో కేరళకు చెందిన దంపతులు, తమిళనాడు చెందిన ఇద్దరు పౌరులు ఉన్నట్టు దుబాయ్ స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.