హైదరాబాద్‌లో కాల్పులు.. బీజేపీ నేత అల్లుడి మృతి
హైదరాబాద్ నగరంలో భయానక సంఘటన ఒకటి జరిగింది. భారతీయ జనతా పార్టీ నేత అమర్‌సింగ్ అల్లడు ఆకాష్ సింగ్ తుపాకీ కాల్పుల్లో మరణించాడు. ఈ కాల్పులు తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు వైద్యుులు నిర్ధారించారు. దీంతో కాల్పులు జరిపిన ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు తపచపుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్వాన్ మురిగి సమీపంలో ఆకాష్ సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అదీ కూడా పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరపడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న తపచపుత్రా పోలీసులు వెంటనే నేరస్థలానికి చేరుకున్నారు. విచారణలో ఆ ప్రదేశంలో తుపాకులు, కత్తులు లభ్యమయ్యాయి. చాలా కాలంగా ఉన్న ఫ్యాక్షన్ గొడవల కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
కాల్పుల అనంతరం క్రాంతి, అతని మద్దతుదారులు పారిపోయారని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు