సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (09:16 IST)

'ది కేరళ స్టోరీ' ఎఫెక్ట్ : మాజీ ప్రియుడిపై వర్ధమాన మోడల్ ఫిర్యాదు..

ranchi model
ఇటీవల విడుదలైన చిత్రం 'ది కేరళ స్టోరీస్'. ఈ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితో పలువురు యువతులు తమకు జరిగిన అన్యాయాన్ని బహిరంగ పరిచేందుకు ధైర్యం చేస్తున్నారు. అలాంటి వారిలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వర్ధమాన నటి కూడా ఉన్నారు. మతం మారి తనను పెళ్లి చేసుకోవాలంటూ తన మాజీ ప్రియుడు తనపై ఒత్తిడి తెచ్చాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా, తనపై అత్యాచారం చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్‌కు చెందిన మాన్వీ అనే యువతి మోడల్ అవ్వాలన్న కోరికతో గత 2020లో రాంచీలోని యస్ మోడలింగ్ ఏజెన్సీలో చేరింది. ఈ క్రమంలో ఆ సంస్థ యజమానితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. 
 
కొన్నాళ్ల తర్వాత ఆమెకు యశ్ అసలు పేరు తన్వీర్ అఖ్తర్‌ అని తెలిసింది. ఈ క్రమంలో అతను ఆమెను తమ మతంలోకి మారి పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేసినట్టు మాన్వీ ఇపుడు ఆరోపిస్తుంది. పైగా, తాను ఆ సమయంలో అతనితో సన్నిహితంగా దిగిన ఫోటోలను బహిర్గంతం చేస్తానంటూ బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
అయితే, మాన్వీ ఆరోపణలను తన్వీర్ కొట్టిపారేశారు. తన నగ్న చిత్రాలను స్నేహితులు, బంధువులకు మాన్వియే పంపించిందని వాపోతున్నాడు. తన ఫోనులోని వ్యక్తిగత సమాచారాన్ని ఆమె చోరీ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించాడు. తామిద్దరం కలిసి ఉండాలని కోరుకున్నామని, ఆమెకు హాని చేయాలన్న ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని చెబుతున్నాడు. అయితే, పోలీసులు మాత్రం మాన్వీ ఇచ్చిన ఫిర్యాదుతే కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.