బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 29 జులై 2023 (22:50 IST)

భారతదేశంలో అతిపెద్ద స్టోర్‌తో విస్తరణ పరంగా ముందడుగు వేసిన మ్యాక్స్ ఫ్యాషన్

image
దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ చైన్, మ్యాక్స్ ఫ్యాషన్, కొచ్చిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పింది. భారతదేశంలోని 200 కంటే ఎక్కువ నగరాలకు తమ కార్యకలాపాలను మ్యాక్స్ విస్తరించింది. ఈ ప్రతిష్టాత్మక మైలురాయి స్టోర్ ప్రారంభించడం ద్వారా కేరళలో తమ  మార్కెట్‌ను నిర్మించడానికి అతి పెద్ద ముందడుగు వేసింది. దక్షిణాదిలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ, మ్యాక్స్ గణనీయంగా బ్రాండ్ మార్పును చేసి, యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన కలెక్షన్‌ను పరిచయం చేసింది. రాబోయే సంవత్సరంలో మరో 100 స్టోర్‌లను ప్రారంభించటానికి ప్రణాళిక చేయడంతో, బ్రాండ్ అగ్రశ్రేణి మరియు అభివృద్ధి చెందుతున్న నగరాల్లో స్థిరమైన విస్తరణకు సిద్ధమైంది.
 
మ్యాక్స్ ఫ్యాషన్ ఇండియా డిప్యూటీ సీఈఓ సుమిత్ చందన మాట్లాడుతూ, “దేవుని సొంత దేశంగా కీర్తించబడుతున్న కేరళలో మా అతిపెద్ద ఇండియా స్టోర్‌ను ప్రారంభించడం పట్ల మేము సంతోషంగా వున్నాము. విస్తృత స్థాయిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో వున్న ఈ స్టోర్లో మీరు ఎంచుకోవటానికి అపారమైన అవకాశాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా ట్రెండ్‌లు, ఫ్యాషన్‌తో, ఇది కేరళకు మా ఓనం కానుకగా నిలుస్తుంది. ఇది భారతదేశంలో మా 465వ స్టోర్ కాగా ప్రపంచవ్యాప్తంగా 850వ స్టోర్..." అని అన్నారు.
 
పల్లవి పాండే, మార్కెటింగ్ హెడ్, మ్యాక్స్ ఫ్యాషన్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ “మా విలువైన కస్టమర్‌లకు సాటిలేని షాపింగ్ అనుభవాన్ని అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ పండుగ సీజన్‌ను ఘనంగా జరుపుకోవడానికి వినియోగదారులకు ఒక కారణాన్ని అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ స్టోర్ 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హోమ్ సెంటర్ కలిగి వుండి, మీ ఇంటి అవసరాలను తీర్చడానికి నిర్మించబడింది. పురుషులు, మహిళలు, పిల్లల కోసం స్టైలిష్ దుస్తులు, పాదరక్షలు, యాక్ససరీల విస్తృత శ్రేణిని మ్యాక్స్ కలిగి ఉంది.