శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జులై 2023 (14:37 IST)

పిచ్చాసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన యువకుడు.. తాత అమ్మమ్మలను చంపేశాడు..

crime scene
కేరళ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ రాష్ట్రంలోని త్రిశూర్ పిచ్చాసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఓ యువకుడు తాత, అమ్మమ్మలను చంపేశాడు. అక్కడ నుంచి కర్నాటక రాష్ట్రానికి పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
త్రిశూర్‌కు చెందిన అక్మల్ అనే యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఓ మానసిక వైద్యశాలలో చికిత్స తీసుకొని ఆదివారమే ఇంటికి వచ్చాడు. 
 
అతడి తల్లి రెండో పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో తాత, అమ్మమ్మల వద్దే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున వృద్ధులైన అబ్దుల్లా (75), జమీలా(64) హత్య చేసి ఇంటి నుంచి పరారయ్యాడు.
 
 
 
బంధువు ఒకరు కిరాణా సామాన్లను ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా.. వృద్ధులిద్దరూ విగతజీవులై పడివుండటాన్ని గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
దీంతో సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు అక్మల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కర్ణాటకలోని ఉన్నాడని తెలుసుకొని అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. మంగుళూరు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.