1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TTD to Issue daily 1000 tickets to Devotees who came from TSRTC

తిరుమలకు వెళ్లే తెలంగాణ శ్రీవారి భక్తులకు శుభవార్త

tsrtc
తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం అనేక మంది భక్తులు ప్రతి రోజూ వెళుతుంటారు. వీరి కోసం తెలంగాణ ఆర్టీసీ ఒక శుభవార్త చెప్పింది. రోజుకు వెయ్యి మందికి రూ.300 దర్శన టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణానికి రెండు రోజుల ముందు ఈ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, రోజుకు వెయ్యి టిక్కెట్లను ఇచ్చేందుకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమ్మతం తెలిపారని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్‌లు మాట్లాడుతూ తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ తరహా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అందువల్ల భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వారు కోరారు. కాగా, ఆర్టీసీ చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కరోనా మాత్రలని మత్తు మాత్రలు ఇచ్చి బాలికపై హాస్టల్ కరస్పాండెంట్ అత్యాచారం