1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Bigg Boss Telugu Grand Finale Winner

ఆ ఐదుగురిలో "బిగ్ బాస్" విజేత ఎవరు?

హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాగ్ రియాల్టీ షోలో ఆదివారం రాత్రి 4 గంటల పాటు జరిగే ప్రత్యేక కార్యక్రమంతో ముగియనుంది. ఈ షో ఫైనల్స్‌కు ఐదుగురు పార్టిసిపెంట్స్ మిగిలారు

Bigg Boss Telugu
హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాగ్ రియాల్టీ షోలో ఆదివారం రాత్రి 4 గంటల పాటు జరిగే ప్రత్యేక కార్యక్రమంతో ముగియనుంది. ఈ షో ఫైనల్స్‌కు ఐదుగురు పార్టిసిపెంట్స్ మిగిలారు. వీరిలో అంతిమ విజేత ఎవరన్నదానిపై ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
ఈ ఐదుగురిలో శివ బాలాజీ, హరి తేజ, ఆదర్శ్, నవదీప్‌ల మధ్య తీవ్ర పోటీ ఉన్నా అర్చన పేరు మీద జరుగుతున్న హంగామా తక్కువేమీ లేదు. తాజాగా ఇన్నర్ సోర్సెస్ నుంచి అందిన సమాచారం మేరకు బిగ్ బాస్ షో విన్నర్ శివ బాలాజీనేనట. 
 
పోల్స్ ప్రకారం, వచ్చిన ఓట్లు ప్రకారం చూసుకుంటే శివ బాలాజీనే ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం. హరితేజ నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ సినిమా ఫీల్డ్‌లో శివబాలాజీకున్న పేరు, పలు సినిమాల్లో గుర్తింపు ఉన్న పాత్రలు చేయటం, భార్య స్వప్న మాధురి సోషల్ మీడియాల బాగా క్యాంపైన్ చేయటం బాగా ఫలితాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే శివబాలాజీ‌నే ఫైనల్‌గా రూ.50 లక్షలు కొట్టేసే ఛాన్సెస్ ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇక అతిథుల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ముగింపు కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రానున్నారు. అలాగే, హీరో నాగార్జున కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు గత రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. మొత్తమీద మరికొన్ని గంటల్లో అంతిమ విజేత ఎవరో తేలిపోనుంది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హీరోయిన్ కాదు.. 'సైనా'ను ఢీకొట్టే పాత్ర...