మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (14:42 IST)

హీరోయిన్ కాదు.. 'సైనా'ను ఢీకొట్టే పాత్ర...

మెగాస్టార్ చిరంజీవి నటించే తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". హీరో రాం చరణ్ నిర్మాతగా ఏ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ

మెగాస్టార్ చిరంజీవి నటించే తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". హీరో రాం చరణ్ నిర్మాతగా ఏ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం నయనతారను ఎంపిక చేసుకోవడంతో, కథానాయికగానే అనుకున్నారు. 
 
కానీ ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందనీ, 'నరసింహా రెడ్డి'ని ఢీకొట్టే పాత్రలో ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం. విలక్షణమైన పాత్ర కనుకనే నయనతార అయితే పూర్తి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకున్నది అమితాబ్ కూతురు పాత్ర కోసమని అంటున్నారు. కథ ప్రకారం చిరంజీవి సరసన ఇద్దరు కథానాయికలు అవసరం కానున్నారు.