శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 జులై 2017 (13:44 IST)

విఘ్నేష్‌కు బీఎండబ్ల్యూ కారు? ఇక పెళ్లెప్పుడు? అమలాపాల్ స్టోరీ నయనకు గుర్తొస్తుందా?

శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం కటీఫ్ అయ్యాక.. చేతినిండా ఆఫర్లతో దూసుకుపోతున్న నయనతార, ప్రస్తుతం కొత్త బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. దర్శకుడు అయిన విఘ్నేష్‌ కూడా నయనతో పీకల్లో

శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం కటీఫ్ అయ్యాక.. చేతినిండా ఆఫర్లతో దూసుకుపోతున్న నయనతార, ప్రస్తుతం కొత్త బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. దర్శకుడు అయిన విఘ్నేష్‌ కూడా నయనతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని కోలీవుడ్ కోడైకూస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం వంటి చిత్రాల్లో నటిస్తూ.. మరికొన్ని ఆఫర్లను చేతిలో పెట్టుకుని.. షూటింగ్‌ల్లో బిజీగా వున్న ఈ భామ త్వరలో విఘ్నేష్‌ను పెళ్లాడనుందని టాక్. 
 
రెమ్యునరేషన్ ఎంత పెంచిన దర్శకనిర్మాతలు నయనతార వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో విఘ్నేష్‌ను వివాహం చేసుకోవాలని నయనతార భావిస్తుందట. ఇప్పటికే వీరి ప్రేమ వ్యవహారం గురించి రకరకాల కామెంట్లు వచ్చినా ఇద్దరూ ఖండించకపోవడంతో నయన-విఘ్నేష్ ప్రేమలో వున్నారని కన్ఫామ్ అయిపోయిందని.. త్వరలోనే వీరిద్దరూ ఒకింటివారు కానున్నట్లు సినీ జనం అనుకుంటున్నారు. 
 
అయితే పెళ్లికి తర్వాత నయన నటిస్తుందా? అమలా పాల్ పెళ్లయ్యాక ఎదుర్కొన్న సమస్యలను తనకు ఎదురైతే ఏం చేయాలి? అనే అంశాలను బేరీజు వేసుకుంటూ నయన ముందుకెళ్తున్నట్లు సన్నిహితుల సమాచారం. దీనిపై నయనతార నోరు విప్పితే గానీ అసలు సంగతి తెలియదు.