1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. boyapati sreenu, nandamuri actors, jr ntr

నందమూరి వంశానికి దూరమై దర్శకుడు... కథ చెప్పబోతే సమయం లేదన్నాడట...

నందమూరి వంశమంటే ఇష్టమని చెప్పే దర్శకులు చాలామందే వున్నారు. వైవిఎస్‌ చౌదరి అయితే.. ఆ వంశం తన ప్రాణమనేంతగా స్పీచ్‌ ఇస్తాడు. కానీ వారితో సినిమా చేసింది లేదు. ఇక బోయపాటి శ్రీను బాలయ్యతో రెండు హిట్లు ఇచ్చాడు. కానీ ఎన్‌టిఆర్‌కు పెద్ద డిజాస్టర్‌ 'దమ్ము' ఇచ్

boyapati sreenu
నందమూరి వంశమంటే ఇష్టమని చెప్పే దర్శకులు చాలామందే వున్నారు. వైవిఎస్‌ చౌదరి అయితే.. ఆ వంశం తన ప్రాణమనేంతగా స్పీచ్‌ ఇస్తాడు. కానీ వారితో సినిమా చేసింది లేదు. ఇక బోయపాటి శ్రీను బాలయ్యతో రెండు హిట్లు ఇచ్చాడు. కానీ ఎన్‌టిఆర్‌కు పెద్ద డిజాస్టర్‌ 'దమ్ము' ఇచ్చాడు. మేకింగ్‌ విషయంలోనూ ఎక్కువ ఖర్చు పెట్టించే బోయపాటిపై ఆ మధ్య కొరటాల శివ పెద్ద విమర్శ చేశాడు. 
 
తన కథను ఆయన కథగా వేసుకుని తనను అవమానించాడనీ చెప్పడంతో.. పెద్ద రాద్దాంతం జరిగింది. ఈ విషయంలో ఎలా స్పందించాలో బోయపాటికి అర్థంకాలేదు. కానీ ఇండస్ట్రీలో అప్పటికే కొరటాలకు ప్రముఖులంతా సపోర్ట్‌గా నిలిచారు. అందుకే ఎన్‌టిఆర్‌.. తనకు కొరటాల శివతో చేయాలని కోరుకుంటున్నాడు. బోయపాటి ఓ కథను చెప్పడానికి ప్రయత్నించగా.. సమయం లేదని దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది.
About Writer
DV
తర్వాతి కథనం
కాల్ మనీ కీచకుల "చెర" నుంచి తప్పించుకొని....