సంబంధిత వార్తలు
- నా భార్య వల్లే సినిమా ఛాన్స్‌లు : బాలీవుడ్ నటి భర్త
- రెండురోజుల్లో పూరి, తరుణ్‌ల అరెస్టు చేస్తారా?
- పని ఒత్తిడి నుంచి బయటపడాలంటే డ్రగ్స్ వాడాల్సిందే.. హీరోకు చెప్పిన దర్శకుడు...
- ఛార్మి బౌలింగ్‌కు ముద్రగడ క్లీన్ బౌల్డ్ ...ఎలాగంటే?
- ఇంతకీ చార్మీని సిట్ విచారించిందా.. సిట్‌ని చార్మీయే విచారించిందా.. రాజసంగా ఫోజిచ్చింది కదా!
బిగ్ బాస్-2.. హోస్ట్‌గా నాగార్జున లేదా నాని.. పార్టిసిపెంట్స్‌గా చార్మీ, తరుణ్, లాస్య..
బిగ్ బాస్-1లో శివబాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా జరిగిన బిగ్ బాస్ తొలి సీజన్ అంత రసవత్తరంగా సాగలేదని టాక్ వస్తోంది. అందుకే మా టీవీ నిర్వాహకులు ఈసారి బిగ్ బాస్ షో ద్వారా రేటి
బిగ్ బాస్-1లో శివబాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా జరిగిన బిగ్ బాస్ తొలి సీజన్ అంత రసవత్తరంగా సాగలేదని టాక్ వస్తోంది. అందుకే మా టీవీ నిర్వాహకులు ఈసారి బిగ్ బాస్ షో ద్వారా రేటింగ్ పెంచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఇందులో భాగంగా సెన్సేషనల్ కోసం క్రేజున్న స్టార్లను రంగంలోకి దించుతున్నారు. తద్వారా హీరోయిన్ ఛార్మీ, హీరో తరుణ్, వరుణ్ సందేశ్, సింగర్ గీతా మాధురి, యాంకర్ లాస్య, యాంకర్-డైరక్టర్ ఓంకార్‌లను పార్టిసిపెంట్స్‌గా బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హోస్ట్‌ను కూడా మార్చే దిశగా మా టీవీ నిర్వాహకులు సన్నద్ధం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా.. ఆయన స్థానంలో టాలీవుడ్ మన్మథుడు.. మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్ అక్కినేని నాగార్జునను లేకుంటే నేచురల్ స్టార్ నానిని బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బిగ్ బాస్ రెండో సీజన్ ఏప్రిల్ 2, 2018 నుంచి ప్రారంభం కానుందని సమాచారం.
