మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2017 (12:00 IST)

నా భార్య వల్లే సినిమా ఛాన్స్‌లు : బాలీవుడ్ నటి భర్త

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150వ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన స్టైలిష్ విలన్ తరుణ్ అరోరా. ఈయన బాలీవుడ్ నటి అంజలా జవేరీ ముద్దుల భర్త. ఈయన పైకి స్టయిల్‌గా కనిపిస్తూనే క్రూరత్వాన్ని ప్రద

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150వ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన స్టైలిష్ విలన్ తరుణ్ అరోరా. ఈయన బాలీవుడ్ నటి అంజలా జవేరీ ముద్దుల భర్త. ఈయన పైకి స్టయిల్‌గా కనిపిస్తూనే క్రూరత్వాన్ని ప్రదర్శించగలరు. తన స్టయిల్‌తో, లుక్స్‌తో దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. 
 
‘ఖైదీ నెం 150’లో విలన్‌గా నటించి తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తరుణ్.. తనకు సినీ అవకాశాలు రావడానికి కారణం తన భార్యేనని ముమ్మాటికీ చెపుతున్నాడు. కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో నా భార్య అంజలాకి ఉన్న పరిచయాల కారణంగానే నాకు కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో అవకాశాలు వస్తున్నాయి. 
 
అదేసమయంలో బాలీవుడ్‌లో నేను చేసిన సినిమాలు చూసి కోలీవుడ్‌లో నాకు అవకాశం వచ్చింది. మొదటి సినిమాలో నా నటన నచ్చడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక టాలీవుడ్‌లో అయితే నా కోలీవుడ్‌ సినిమాలు చూసి చిరంజీవిగారి సినిమాలో ఛాన్స్‌ వచ్చింది.