శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 జులై 2017 (11:29 IST)

పని ఒత్తిడి నుంచి బయటపడాలంటే డ్రగ్స్ వాడాల్సిందే.. హీరోకు చెప్పిన దర్శకుడు...

షూటింగ్ సమయాల్లో పని ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఆ మాత్రం డ్రగ్స్ వాడకం తప్పదని ప్రముఖ హీరోకు ప్రముఖ దర్శకుడు చెప్పినట్టు సమాచారం. హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో సిట్ అధికారులు పలువురు సినీ

షూటింగ్ సమయాల్లో పని ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఆ మాత్రం డ్రగ్స్ వాడకం తప్పదని ప్రముఖ హీరోకు ప్రముఖ దర్శకుడు చెప్పినట్టు సమాచారం. హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో సిట్ అధికారులు పలువురు సినీ ప్రముఖుల వద్ద విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఈవిచారణలో చాలా మంది ఓ దర్శకుడి పేరును ప్రస్తావించినట్టు చెప్పారు. ముఖ్యంగా.. ఆ దర్శకుడు డ్రగ్స్ వాడకం తాము చూశామని చెప్పినట్టు తెలుస్తోంది. 
 
అందుకే డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తూ.. పలువురికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించినట్టు తెలుస్తోంది. విచారణలో పాల్గొన్న ఓ ప్రముఖ హీరో సాక్ష్యం కీలకమని అంటున్నారు. ఆయన డ్రగ్స్ తెప్పించుకుని వాడేవారని, దీన్ని చాలాసార్లు చూశామని, తాను వద్దని చెబితే, "పని ఒత్తిడి నుంచి బయట పడాలంటే, ఆ మాత్రం తప్పదు. కావాలంటే చెప్పండి మీకూ ఇస్తాను" అని ఆయన ఆఫర్ ఇచ్చాడని చెప్పాడు. తాము వద్దని వారించామని, అయినా అతను వాడేవాడని చెప్పాడు.
 
వాస్తవానికి డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఆయనకు లేదని చెప్పిన సదరు హీరో, ఇండియాలో షూటింగులు ఉంటే పెద్దగా డ్రగ్స్ వినియోగించని ఆయన, విదేశాల్లో ఉంటే ఎక్కువగా వాడతారని, తెప్పించిన మత్తుమందుల్లో కొంత తాను ఉంచుకుని, మిగతాది పక్కవారికి అందించేవారని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ దర్శకుడికి వ్యతిరేకంగా లభ్యమైన సాక్ష్యాల్లో ఈ హీరో చెప్పిన సాక్ష్యం రెండోదని సిట్ వర్గాలు అంటున్నాయి.