నాగ చైత‌న్య మ‌ళ్లీ త‌ప్పు చేస్తున్నాడా..? తెలిసి తెలిసీ పప్పులో కాలేస్తున్నాడా?

Naga Chaitanya
శ్రీ| Last Modified శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (15:08 IST)
అక్కినేని నాగ చైత‌న్య మ‌జిలీ సినిమా స‌క్స‌స్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం వెంక‌టేష్‌తో క‌లిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత సోగ్గాడే చిన్నినాయ‌నా సీక్వెల్ బంగార్రాజు సినిమా చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత దిల్ రాజు బ్యాన‌ర్లో నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శితో సినిమా చేయ‌నున్నాడు.

అయితే... వెంకీ మామ ఫుల్ ఫ‌న్ & ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్. కానీ దిల్ రాజు బ్యాన‌ర్లో చేసే సినిమా ల‌వ్ స్టోరీ. అంతాబాగానే ఉంది కానీ... ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మూవీ టైటిల్ మ‌హా స‌ముద్రం. మ‌హా క‌థానాయిక పేరు కాగా వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రుగుతుంది కాబ‌ట్టి స‌ముద్రం అని పెట్టాడ‌ని.. ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అలాగే ఇందులో చైత‌న్య పోలీసాఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఇది పూర్తి యాక్ష‌న్ మూవీగా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే.. చైత‌న్య‌కు యాక్ష‌న్ మూవీస్ అస్స‌లు క‌లిసిరాలేదు‌. ద‌డ‌, బెజ‌వాడ‌, యుద్ధం శ‌ర‌ణం, స‌వ్య‌సాచి.. యాక్ష‌న్ మూవీస్ చేసిన ప్ర‌తిసారీ ఫ్లాప్ అయ్యాయి కానీ స‌క్స‌స్ అవ్వ‌లేదు. ఇది తెలిసి కూడా చైత‌న్య మ‌ళ్లీ యాక్ష‌న్ మూవీ చేస్తున్నాడంటే త‌ప్పు చేస్తున్నాడా..? లేక నిజంగా ఆ సినిమాలో విష‌యం ఉందా..? ఏమో.. ఏం జ‌ర‌ుగ‌నుందో చూడాలి.దీనిపై మరింత చదవండి :