బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 8 ఏప్రియల్ 2019 (20:00 IST)

మజిలీ విజయంతో చైతుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత.. ఏంటది?

ఏమాయే చేశావే, మనం చిత్రాల్లో నాగచైతన్య, సమంతల నటన అద్భుతమన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు గారు మరణించకముందు చిత్రీకరించిన సినిమా మనం. ఈ సినిమాలో నటిస్తుండగానే నాగేశ్వరరావు గారు చనిపోయారు. కానీ ఆ సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయింది. ఒక అద్భుతమైన సినిమాగా అక్కినేని కుటుంబం మొత్తం ఈ సినిమాలో నటించింది.
 
ఆ తరువాత నాగచైతన్య, సమంతలకు వివాహం జరిగింది. వివాహం తరువాత వారిద్దరు కలిసి సినిమాలు చేయకుండా కాస్త గ్యాప్ తీసుకున్నారు. కానీ రీసెంట్‌గా వీరిద్దరు కలిసి నటించిన సినిమా మజిలీ. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సూపర్ డూపర్ హిట్ టాక్‌తో సినిమా విజయంవైపు పరుగులు పెడుతోంది. అయితే తాజాగా సినిమా విజయవంతం కావడంతో నాగచైతన్యకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిందట సమంత.
 
15 లక్షల రూపాయల విలువ చేసే ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిందట. సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని ప్రి-రిలీజ్ నాడే సమంత చెప్పింది. తాను చెప్పినట్లుగా జరగడంతో తన భర్త నాగ చైతన్యకు గిఫ్ట్ ఇచ్చినట్లు చెబుతోంది సమంత.