శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (16:18 IST)

చివరికి ఏదీ ఉండదు... క్యూట్ కపుల్ పిక్ వైరల్

రెండు రోజుల ముందు విడుదలైన "మజిలీ" సినిమా హిట్ టాక్‌తో భారీగా కలెక్షన్లను వసూలు చేస్తోంది. పెళ్లి తర్వాత సమంత, నాగచైతన్య అక్కినేని కలిసి నటించిన మొదటి చిత్రం కావడంతో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. 'నిన్ను కోరి' దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాపై సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సమంత, చైతన్య కపుల్ ఇటీవల షేర్ చేసిన పిక్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.
 
విమానంలో పక్కపక్కన కూర్చుని, నాగచైతన్య చెవుల్లో హెడ్‌సెట్‌తో ల్యాప్‌టాప్‌లో దూరిపోయి ఉండగా, భర్తపై పడుకుని సేద తీరుతున్నప్పుడు ఎవరో క్లిక్‌మనిపించిన ఈ క్యూట్ ఫోటోను సమంత తన సోషల్ మీడియా అకౌంట్‌లో అభిమానులతో షేర్ చేసింది. ఈ ఫోటోకు "ఇన్ ది ఎండ్... నథింగ్ ఎల్స్ మ్యాటర్స్" అంటూ వ్యాఖ్యానించింది. 
 
ఓ సందర్భంలో 'మజిలీ' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత మాట్లాడుతూ.. చైతూ హృదయంలో స్థానం సంపాదించుకోవడానికి ఎనిమిదేళ్లు పట్టింది. నేను బాగా ఇష్టపడిన సమయంలో నా ప్రేమను అంగీకరించడానికి ఆయన మానసికంగా సిద్ధంగా లేరు. మేమిద్దరం ఓ అవగాహనకు రావడానికి చాలా సమయం పట్టిందంటూ సమంత చెప్పుకొచ్చింది. 
 
పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా మేము ఎన్నోసార్లు పోట్లాడుకున్నాము. కానీ పెళ్లి తర్వాత నేను మా కోపాన్ని నియంత్రించుకుంటున్నాను. మేము ఎన్నిసార్లు గొడవపడినా హ్యాపీగా కలిసిపోయి దానికి పరిష్కారాన్ని ఆలోచిస్తామంటూ పేర్కొంది.