మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2019 (18:53 IST)

తల్లిగా మారిన యాంకర్ లాస్య.. ఉగాది రోజున బాబు పుట్టాడు..

ప్రముఖ యాంకర్ లాస్య తల్లి అయ్యింది. బుల్లితెరపై రాణించిన లాస్య ఉగాది నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. ఈ ఉగాది తనకెంతో ప్రత్యేకమంటూ క్యాప్షన్ పెట్టింది. 14 గంటల పాటు ప్రసవ వేదన తర్వాత తన బిడ్డను చూసుకున్నానంటూ చెప్పుకొచ్చింది. 
 
యాంకర్‌గా కెరీర్ ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడే లాస్య పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైంది. తన చిన్ననాటి స్నేహితుడు మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లాడిన లాస్య ఆపై యాంకరింగ్‌ చేయలేదు. ఇటీవలే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. 
 
ఇందులో పలు వీడియోలు పోస్టు చేస్తూ.. యూజర్లను ఆకట్టుకుంటోంది. సమ్ థింగ్ స్పెషల్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన చలాకీ యాంకర్ లాస్య... 2017 ఫిబ్రవరి 17న మంజునాథ్‌ను వివాహం చేసుకుంది. 
 
తెలుగు యాంకర్‌లలో లాస్యది ప్రత్యేకమైన స్థానం. అనసూయ, రష్మీ, శ్రీముఖి.. లాంటివాళ్లతో పోటీని తట్టుకంటూ తనకంటూ లాస్య ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా లాస్య తల్లి అయ్యింది. ఈ మేరకు తన భర్త, బాబుతో కలిసిన తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.