1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sundeep Kishan - Krishna Vamsi's Nakshatram Launched

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్... కల నిజమైందంటూ ట్వీట్

Sundeep Kishan
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ కొత్త సినిమా ''న‌క్ష‌త్రం'' బుధవారం ప్రారంభ‌మైంది. రామ్ చరణ్‌తో ''గోవిందుడు అందరివాడేలే'' చిత్రంతో చాలా కాలం తర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభించాడు. మొదట దిల్ రాజు నిర్మాణంలో ''రుద్రాక్ష''ను ప్లాన్ చేశాడు. ఆ తర్వాత బాలయ్య వందో సినిమాకి ఓ స్టోరీ లైన్ వినిపించి.. ''రుద్రాక్ష''ను పక్కన పెట్టేశాడు. బాలయ్యతో సినిమా సెంచరీ తీయాలనుకుంటే అది కాస్త క్రిష్ చేతికి వెళ్లిపోవడం, ''రుద్రాక్ష'' విషయంలో దిల్ రాజు కూడా వెనక్కి తగ్గాడంతో.. కృష్ణవంశీ డైలమాలో పడ్డాడు. చివరికి ''న‌క్ష‌త్రం'' సినిమాతో బిజీ అయ్యాడు. 
 
ఈ చిత్రంలో యంగ్ హీరో సందీప్ కిష‌న్ పోలీస్‌ పాత్రను పోషిస్తున్నాడు. పోలీస్ యాక్ష‌న్ స్టోరీగా తెర‌కెక్కే ఈ చిత్రంలో ఊహించ‌ని ట్విస్ట్ లు, భారీ యాక్ష‌న్స్ సీన్స్ ఉంటాయ‌ట‌. అవ‌న్నీ రియ‌లిస్టిక్‌గా ఉండేలా వైవిధ్యంగా చిత్రీక‌రించ‌డానికి యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభ‌మైన సంద‌ర్భంగా హీరో సందీప్ కిష‌న్ ట్విట్ట‌ర్‌లో... నా ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ గారితో పనిచేయడం గ్రేట్‌గా ఫీల‌వుతున్నాను. ఈ మూవీ టైటిల్ న‌క్ష‌త్రం. కృష్ణ‌వంశీ గారితో సినిమా చేయాల‌నే నాక‌ల ఈ రోజు నిజ‌మైంది అంటూ త‌న సంతోషాన్నితెలియజేశాడు. 
 
ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయ‌డానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్న‌ారు. ఇప్పటికే ముహూర్తం షాట్ కూడా తీసేయడంతో.. ఇక ప్రాజెక్టు పట్టాలెక్కినట్లే. మిగతా వివరాలను అధికారికంగా త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. 
తర్వాతి కథనం
రష్మీకి ఛాన్సులే ఛాన్సులు.. 'చారుశీల'గా అందాలు ఆరబోసేందుకు రెఢీ!