1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Tower Star Good bye to Jabardasth Show

జబర్ధస్త్‌లో ఇక నాగబాబు కనిపించరా?

జబర్ధస్త్ ప్రోగ్రామ్‌ హైప్ ఎంతగా వుందో అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లోని స్కిట్లు, యాక్టర్లు, జడ్జీలు తెగ పాపులర్ అయిపోయారు. స్క్రిట్లలో నటించిన వారంతా కమెడియన్లుగా ఎదిగిపోతున్నారు. అయితే సోషల్ మీడ

Tower Star
జబర్ధస్త్ ప్రోగ్రామ్‌ హైప్ ఎంతగా వుందో అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లోని స్కిట్లు, యాక్టర్లు, జడ్జీలు తెగ పాపులర్ అయిపోయారు. స్క్రిట్లలో నటించిన వారంతా కమెడియన్లుగా ఎదిగిపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో తాజాగా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు నాగబాబు దూరమవుతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఈ ప్రోగ్రామ్‌‌కు సంబంధించి ప్రతీదీ సామాజిక మాధ్యమాల్లో చర్చకు వస్తుంది. తాజాగా నాగబాబు ఈ కార్యక్రమానికి గుడ్ బై చెపుతున్నారని టాక్.
 
నటుడు నాగబాబు, నటి రోజా జబర్దస్త్‌కు జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జబర్ధస్త్‌లో కొన్ని జోకులకు నవ్వు వచ్చినా.. రాకపోయిన రోజా, నాగబాబు కితకితలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే నాగబాబు కొన్ని ఎపిసోడ్స్‌కు మాత్రమే కనిపించరని.. ఏదో సినిమా కోసం విదేశాలకు వెళ్ళాల్సి వుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. మరి ఈ వార్తలపై నాగబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
About Writer
Selvi
తర్వాతి కథనం
రోమియో జూలియట్ మ్యూజికల్ డ్రామాలో వరలక్ష్మీ శరత్ కుమార్