Mysuru: భార్య, ఇద్దరు కుమార్తెల గొంతు నులిమి చంపేసిన భర్త
crime scene
ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన వాహన రికవరీ విభాగంలో పనిచేసే హరీష్, కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆర్థిక ఇబ్బందులు పెరగడం వల్లే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితమే హరీష్ తన తల్లిని ఆమె పుట్టింటికి పంపినట్లు సమాచారం. ఇంట్లో ఒక సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. హున్సూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
