1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

అదో రొమాంటిక్ టచ్

రంగ్ దే బసంతి బాలీవుడ్ సోహా అలీఖాన్
FileFILE
'రంగ్ దే బసంతి' చిత్రం ద్వారా బాలీవుడ్ వెండితెరపైకి దూసుకువచ్చిన సెక్సీ చూపుల చిన్నది సోహా అలీఖాన్. ఒకప్పటి బ్యూటీ క్వీన్ షర్మిలా టాగూర్ ముద్దుల చిన్నకూతురు, సైఫ్ అలీ ఖాన్ చిన్న చెల్లెలు అయిన సోహా 'ఖోయా ఖోయా చంద్' చిత్రం ద్వారా మరోసారి తళుక్కుమననుంది. ప్రతి చిత్రంలోనూ ప్రేక్షకులకు తనకంటూ ఓ ప్రత్యేకతను చూపాలని తాను తాపత్రయపడతానని కొత్త సంగతులు చెపుతోంది.

'నీ తాజా చిత్రం ఎలా ఉంటుంద'ని అడిగితే, 'అదో రొమాంటిక్ టచ్ ఉన్న సబ్జెక్ట్. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోని పరిస్థితులను కాస్తంత స్ప్రుశిస్తూ సాగుతుంది. నా పాత్రను దర్శకులు చక్కగా మలిచారు' అంటోంది.

అంతేకాదు ఈ చిత్రంలో తాను పూర్తిస్థాయి గ్లామర్‌ను ప్రదర్శించానంటోంది. ఇన్నాళ్లకు సోహా‌కు బాలీవుడ్ సినీ ఫార్ములా వంటబట్టిందన్నమాట. గ్లామర్‌గా కనిపిస్తాను మొర్రో అని ఇంతగా విడమరిచి చెపుతుంటే ప్రేక్షకులు మాత్రం ఆ చిత్రాన్ని చూడకుండా ఎందుకు వదిలిపెడతారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి