సంబంధిత వార్తలు
- ఆ రోజు పోలీసులు రాకపోతే అంతా అయిపోయేదే... నమిత ఫ్లాష్‌బ్యాక్
- సహజీవనంలో తప్పులేదు.. ప్రేమిస్తే పెళ్లి కాకపోయినా కలిసుండొచ్చు: కత్తి మహేష్
- నమిత - వీరు అఫిషియల్ వెడ్డింగ్ వీడియో
- నేను, అమ్మ, పాప ముగ్గురం అడిగినా ఆమె ఒప్పుకోలేదు: జగన్
- పైకి రావాలంటే 'యు షుడ్ స్లీప్ విత్ మి' అన్నాడు...: ఫిదా గాయత్రి గుప్త (వీడియో)
నా భర్త చాలా బాగా వంట చేస్తారు.. లక్కీగా హీరోయిన్ అయ్యా: నమిత
ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాల ముద్దుగుమ్మ నమిత ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇటీవలే తన స్నేహితుడు వీరేంద్ర చౌదరిని నమిత పెళ్లాడిన సంగతి తెలిసిందే. తన తల్లి కూడా అందగత్తె అని.. తొలినాళ్లలో సిన
ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాల ముద్దుగుమ్మ నమిత ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇటీవలే తన స్నేహితుడు వీరేంద్ర చౌదరిని నమిత పెళ్లాడిన సంగతి తెలిసిందే. తన తల్లి కూడా అందగత్తె అని.. తొలినాళ్లలో సినిమాల్లోకి రావడం తన లక్ష్యం కాదని.. మోడల్ కావాలని అనుకున్నానని తెలిపింది. తనకు వండటం రాదని, తన భర్త వీరూ మంచి కుక్ అని తెలిపింది.
సొంతం సినిమాతో ఆడిషన్ కోసం తాను హైదరాబాద్ వచ్చానని, ఆ ఆడిషన్‌కు ఒక్క రోజే మరో 40మంది అమ్మాయిలు కూడా వచ్చారని నమిత తెలిపింది. తాను సినిమాకు ఎంపిక కాననే అనుకున్నానని... కానీ, లక్కీగా హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యానని వెల్లడించింది.
సినిమాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ.. పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోవాలనే కోరిక తనకు బలంగా ఉండేదని నమిత చెప్పింది. మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుకునేదాన్నని చెప్పింది. ప్రతి అమ్మాయికీ ఉండే ఫీలింగ్స్ అని తెలిపింది. వీర లాంటి మంచి భర్తను పొందడం తన అదృష్టమని నమిత వెల్లడించింది.
తర్వాతి కథనం
