మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (17:51 IST)

సహజీవనంలో తప్పులేదు.. ప్రేమిస్తే పెళ్లి కాకపోయినా కలిసుండొచ్చు: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ సహజీవనంపై నోరు విప్పాడు. ఇన్నాళ్లు పవన్‌పై విమర్శలు చేస్తూ.. సోషల్ మీడియాలో నెటిజన్ల నోళ్లల్లో నానుతున్న కత్తి మహేష్ తాజాగా సహజీవనంలో తప్పులేదంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో కత్త

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ సహజీవనంపై నోరు విప్పాడు. ఇన్నాళ్లు పవన్‌పై విమర్శలు చేస్తూ.. సోషల్ మీడియాలో నెటిజన్ల నోళ్లల్లో నానుతున్న కత్తి మహేష్ తాజాగా సహజీవనంలో తప్పులేదంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో కత్తి మహేష్ మాట్లాడుతూ.. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో మానవీయ విలువలు మారాయన్నాడు. వివాహ వ్యవస్థకు బాధ్యతలు ఎక్కువన్నాడు.
 
ప్రస్తుతం కొంతమంది సహజీవనానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో ఎలాంటి తప్పులేదని కత్తి మహేష్ చెప్పుకొచ్చాడు. ప్రేమించిన తర్వాత కలిసుండాలని అందరూ కోరుకుంటారు. అది పెళ్లి ద్వారానే అవుతుందని ఒకప్పుడు అనుకునేవాళ్లం. అయితే పెళ్లికాకపోయినా కలిసుండాలని అనుకోవడంలో తప్పులేదని కత్తి మహేష్ అన్నారు. 
 
ప్రస్తుతం పెళ్లి ద్వారా బాధ్యతల వలయంలో చిక్కుకుని బయటికి రాని పరిస్థితిలో చాలామంది ఇరుక్కుపోతున్నారు. సహజీవనం ప్రస్తుతం లీగల్ కావడంతో అందులో తప్పులేదని.. ఒకరినొకరు అర్థం చేసుకుని సహజీవనం చేయడం.. ఆపై ఆ బంధానికి వివాహం అనే ట్యాగ్ తగిలించడం బెటరైన ఆప్షన్ అంటూ కత్తి మహేష్ చెప్పుకొచ్చాడు.