1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 23 డిశెంబరు 2017 (14:29 IST)

'హలో'పై కత్తి మహేష్ రివ్యూ... అతడలా చేసి వుంటే ఎవరూ మాట్లాడేవారు కాదు...

కొత్త సినిమాలకు వెంటనే రివ్యూలు చెప్పి వివాదంలో ఇరుక్కునే కత్తి మహేష్ మరోసారి అలాంటి పనే చేశాడు. అక్కినేని అఖిల్ నటించిన 'హలో' సినిమాపై కత్తి మహేష్ చెప్పిన రివ్యూ ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. హలో సినిమాలో మొత్తం మనసంతా నువ్వ

కొత్త సినిమాలకు వెంటనే రివ్యూలు చెప్పి వివాదంలో ఇరుక్కునే కత్తి మహేష్ మరోసారి అలాంటి పనే చేశాడు. అక్కినేని అఖిల్ నటించిన 'హలో' సినిమాపై కత్తి మహేష్ చెప్పిన రివ్యూ ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. హలో సినిమాలో మొత్తం మనసంతా నువ్వే ప్రేమ కథా చిత్రం టైపులో ఉంది. అయితే ఆ సినిమాకు ఈ సినిమాకు అసలు పొంతనే లేదు. అఖిల్ సినిమాతో ఫ్లాప్‌తో ఇబ్బందిపడే అఖిల్‌కు ఈ సినిమా బాగా కలిసొస్తుంది. ఈ సినిమా చాలా బాగుంది.
 
అఖిల్, కళ్యాణిల కాంబినేషన్ అదిరిపోయింది. రమ్యక్రిష్ణ, జగపతిబాబుల యాక్షన్ సినిమాకు ప్లస్ పాయింట్. అనూప్ రూబెన్స్ సంగీతం మాత్రం బాగాలేదు. అనూప్ సంగీతం బాగా చేసి ఉంటే సినిమాపై ఎవరూ అస్సలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం సినిమాతో మ్యూజిక్ చేసిన తరువాత అనూప్ రూబెన్స్ తన సంగీతాన్ని పూర్తిగా మరిచిపోయినట్లున్నారు. సంగీతం మినహా సినిమా చాలా బాగుందంటూ కత్తి మహేష్ చెప్పుకొచ్చాడు. చాలా రోజుల తరువాత ఒక సినిమా బాగుందని కత్తి మహేష్ సర్టిఫికెట్ ఇవ్వడం ఇప్పుడు తెలుగు విమర్శకులనే ఆశ్చర్యపరుస్తోంది.