1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Do you know what Nandamuri Balakrishna eats?

నందమూరి బాలక్రిష్ణ ఫుడ్ ఏమి తింటాడో తెలుసా !

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna
బాలక్రిష్ణ చాలా సరదాగా వుంటారు. గోల్డ్ స్పూన్ అనే గర్వం వుండదు. స్వంత బేనర్ లో సినిమా అయితే ప్రతీ ఆర్టిస్టునూ టిఫిన్లు, కాఫీలు అందాయా? అని అడుగుతుండేవారు. సాధారణ హీరోలా బిహేవ్ చేసేవాడు. అనసూయమ్మగారి అల్లుడు చేశా. ఆ తర్వాత రక్తాభిషేకం యాక్షన్ సినిమా చేశాను. నారీ నారీ నడుమ మురారి.. కామెడీ, ఫ్యామిలీ సినిమా చేశాను. ఇందులో ఒక్క ఫైట్ కూడా లేదు. భలేదొంగ, బొబ్బిలి సింహం చేశాను అని దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తెలియజేశారు. ఇటీవలే ఆయన ఓ ఇంటర్వూలో అలనాటి సంగతులు గుర్తుచేసుకున్నారు. 
 
అరకులో ఓ సారి షూటింగ్ కు వెళ్ళాం. అక్కడ టిఫిన్ కు బాలయ్యబాబు పిలిచారు. అది తెల్లవారుజామున నాలుగు గంటల సమయం. నాన్నగారు చపాతి, చికెన్ పొద్దున్నే నాలుగు గంటలకు తినేవారు కదా. మనం తిందాం అని చెప్పేవారు. అలా ఒకసారి తిన్నాం. బొబ్బిలి సింహం షూట్ రాజమండ్రిలో మంచి ఎండలో.. చెట్టుకింద చాపలు వేసుకుని లంచ్ బ్రేక్ లో నిద్రపోయేవాళ్ళం. అప్పట్లో కార్ వాన్ లు లేవు అంటూ గతాన్ని నెమరేసుకున్నారు కోదండరామిరెడ్డి.
About Writer
డీవీ
తర్వాతి కథనం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో రేణూ దేశాయ్ భేటీ.. ఎందుకో తెలుసా?