మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 11 జులై 2024 (20:05 IST)

గోల్డెన్ జూబ్లీ హీరోగా నందమూరి బాలకృష్ణకు సన్మానం

Nandamuri Balakrishna,  Sunil Narang
Nandamuri Balakrishna, Sunil Narang
నందమూరి బాలకృష్ణ 30.8.1974న విడుదలైన తెలుగు చిత్రం “తాతమ్మ కల”తో తన సినీ కెరీర్ను హీరోగా ప్రారంభించి, హీరోగా తన కెరీర్లో 50 ఏళ్ల తర్వాత కూడా, సినిమా ఇండస్ట్రీలో   హ్యాట్రిక్లతో హీరోగా కొనసాగుతున్నాడు.  50 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రల్లో హీరోగా కొనసాగుతున్న ప్రపంచంలోనే ఏకైక కళాకారుడు శ్రీ నందమూరి బాలకృష్ణ.  ఆయన  గోల్డెన్ జూబ్లీ సినీ హీరో. 
 
రాజకీయ రంగంలో, ఆయన వరుసగా మూడు పర్యాయాలు A.P. శాసనసభకు ఎన్నికైన హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు.  ఇప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న హైదరాబాద్లోని బసవ తారకం ఇండో-బ్రిటీష్ క్యాన్సర్ హాస్పిటల్స్కు ఆయన ఛైర్మన్గా ఉన్నారు.  ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు ఆయన చేసిన అవిశ్రాంత కృషి మరువలేనిది, ఇక్కడ కేవలం భారతదేశం నుండి వచ్చిన రోగులు మాత్రమే కాకుండా విదేశాల నుండి వచ్చిన రోగులుకూడా చికిత్స పొందుతున్నారు.  బాలకృష్ణ  ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా  అలాగే ప్రజాసేవలో ఆయన చేసిన సేవలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. 
 
 ఈ సందర్భంగా శ్రీ నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్కి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు,  శ్రీ సునీల్ నారంగ్, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు,  ప్రసన్న కుమార్, గౌరవ కార్యదర్శి మరియు కోశాధికారి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలచిత్ర నిర్మాతల మండలి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేస్తూ సినీ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులు 01 సెప్టెంబరు 2024న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయనకు సన్మానం చేయబోతోందనీ, అందుకు అంగీకరించాల్సిందిగా అభ్యర్ధించారు. భారతీయ సినిమా  మరియు ఇతర రంగాలకు చెందిన  ప్రముఖులు కూడా ఈ సన్మాన సభలో పాల్గొంటారు. శ్రీ నందమూరి బాలకృష్ణ గారు వారి అభ్యర్థనను అంగీకరించారు. తదుపరి వీరందరూ శ్రీ నందమూరి బాలకృష్ణ కు ధన్యవాదాలు తెలియజేసారు.