సంబంధిత వార్తలు
- బాలకృష్ణ పైసా వసూల్ 'అరే మామా, ఏక్ పెగ్ లా' మేకింగ్ వీడియో...
- బాలకృష్ణ 'పైసావసూల్' దూకుడు.. ''పదామరి'' సాంగ్ రిలీజ్ (Video)
- బాలయ్య ప్రేమతో కొడతారా? ఐతే పూరీకి ఆ కనెక్ట్స్ వున్నాయేమో? హీరోయిన్ షాకింగ్
- "పైసా వసూల్" చిత్రంలోని 'మామా ఏక్ పెగ్ లా' సాంగ్ ప్రోమో విడుదల
- పూరీ జగన్నాథ్ వరుస ప్లాప్‌లతో టెన్షన్ పడిన హీరోయిన్!
బాలయ్య "పైసా వసూల్"కి యూ/ఏ సర్టిఫికెట్.. చార్మీ ట్వీట్
హీరో బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని రకాల టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి, సరికొత్త రికార్డులను నెలకొల
హీరో బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని రకాల టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి, సరికొత్త రికార్డులను నెలకొల్పాయి.
ఈ నేపథ్యంలో.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని హీరోయిన్ ఛార్మి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్లు పేర్కొంది.
కాగా, ఈ సినిమాలో బాలయ్య చేసిన ఫైట్స్, డ్యాన్స్ , చెప్పిన డైలాగ్స్‌ను ట్రైలర్ రూపంలో ఇప్పటికే చూపించారు. ఆ ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. తమ అభిమాన హీరో బాలయ్య సినిమా ప్రమోషన్ కోసం సాయపడుతున్న ఛార్మికి అభిమానులు కామెంట్ల రూపంలో కృతజ్ఞతలు చెబుతున్నారు.
#Balakrishna @shriya1109 @purijagan @Charmmeofficial #PaisaVasool Gets U/A Certificate From CBFC, Releasing on September 1st pic.twitter.com/f4QNtWKgPg
— Cinema Mania ️ (@ursniresh) August 24, 2017
