గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (15:06 IST)

బాలకృష్ణ పైసా వసూల్ 'అరే మామా, ఏక్ పెగ్ లా' మేకింగ్ వీడియో...

హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 101వ చిత్రం 'పైసా వసూల్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య స్వయంగా ఓ పాటను పాడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో వేడుకల్లో 'ఐయాం ఫ్యాన్ ఆఫ్ ఎన్

హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 101వ చిత్రం 'పైసా వసూల్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య స్వయంగా ఓ పాటను పాడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో వేడుకల్లో 'ఐయాం ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే... ఐహ్యావ్ 101 ఫీవర్' అని ఆలీ అంటే, వెంటనే 'అరే మామా, ఏక్ పెగ్ లా' అని అందుకున్న బాలకృష్ణ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. ఈ చిత్రంలో 'అరె మామా ఏక్ పెగ్ లా...' అంటూ బాలయ్య పాట సాగుతుంది. 
 
"ఐయాం ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే... ఐహ్యావ్ 101 ఫీవర్... మై నర్స్ టోల్డ్ మీ టేక్ మెడిసిన్"... తర్వాత ఆయన అందుకుంటారు పాట అని వెల్లడించారు. పూరీ జగన్నాథ్ పాట పాడమని తనను అడిగితే తాను సరేనన్నానని బాలకృష్ణ చెప్పారు. సంగీత దర్శకుడు రూబెన్స్, పూరీ సహకారంతో ఈ సినిమాలో పాటను గంటలో పాడేశానని అన్నారు.