శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2017 (15:48 IST)

"పైసా వసూల్" చిత్రంలోని 'మామా ఏక్ పెగ్‌ లా' సాంగ్ ప్రోమో విడుద‌ల‌

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 101వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదల చేశారు. అయితే, సెప్టెంబర్ ఒకటో తేదీన విడుదల కానున్న ఈ చిత్రం ప్రోమో సాంగ్‌ను చిత్ర యూనిట్ సోష

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 101వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదల చేశారు. అయితే, సెప్టెంబర్ ఒకటో తేదీన విడుదల కానున్న ఈ చిత్రం ప్రోమో సాంగ్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
 
మొన్నామ‌ధ్య 'స్టంపర్' అంటూ టీజ‌ర్ విడుద‌ల చేసిన టీం ఆడియో వేడుక‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేసి మూవీపై భారీ ఆస‌క్తిని క‌లిగించారు. ఇక నిన్న 'క‌న్ను క‌న్ను' అంటూ శ్రేయ‌, బాల‌య్య‌ల మ‌ధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ప్రోమోని విడుద‌ల చేసిన టీం తాజాగా చిత్ర టైటిల్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. 
 
'మామా ఏక్ పెగ్‌ లా' అంటూ సాగే పాట బాల‌య్య ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది. బాల‌య్యే స్వ‌యంగా ఈ పాట పాడ‌డంతో అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. అనూప్ రూబెన్స్ చిత్రానికి సంగీతం అందించ‌గా చిత్రంలో శ్రేయ‌, ముస్కాన్ క‌థానాయిక‌లుగా న‌టించారు. కైరాద‌త్ స్పెష‌ల్ సాంగ్‌తో సంద‌డి చేయ‌నుంది.