శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (06:38 IST)

ఈ బాలయ్య ఉన్నాడే చాలా మొండోడు... అభిమానం ఉంటేనే కొడతాడు: పూరీ (Video)

ఈ బాలయ్య ఉన్నాడే చూడండి.. చాలా మొండోడు.. ఆయన అభిమానులు బాలయ్య బాబు కంటే ఇంకా మొండోళ్లు అని నిరూపించారని 'పైసా వసూల్' చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ వేడుకల్లో చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు.

ఈ బాలయ్య ఉన్నాడే చూడండి.. చాలా మొండోడు.. ఆయన అభిమానులు బాలయ్య బాబు కంటే ఇంకా మొండోళ్లు అని నిరూపించారని 'పైసా వసూల్' చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ వేడుకల్లో చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. పైగా, బాలయ్య స్పీడ్ చూస్తుంటే.. ఆయన నటించింది 101వ చిత్రంలో కాదనీ.. ఒకటో చిత్రంలో అన్నట్టుగా ఉందన్నారు.
 
గురువారం రాత్రి ఖమ్మం వేదికగా ‘పైసా వసూల్’ ఆడియో రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ... బాలకృష్ణతో మళ్లీ ఇంకో సినిమా చేయాలని ఉందని, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు సినిమా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 
 
బాలకృష్ణ స్పీడ్ చూస్తుంటే మోక్షఙ్ఞ కన్నా చిన్నవాడిలా ఉన్నారంటూ పూరీ కితాబిచ్చారు. బాలయ్యకు బౌన్సర్లు అక్కర్లేదని, ఎందుకంటే, ఆయన అభిమానులను ఆయనే కంట్రోల్ చేయగలరని అన్నారు. 
 
ఈ సందర్భంగా, తన అభిమానిపై బాలయ్య చెంపదెబ్బ కొట్టిన సందర్భాన్ని పూరీ ప్రస్తావించారు. ఎంతో అభిమానం ఉంటేనే ఆయన అలా కొడతారని, దానిని అభిమానులు సీరియస్‌గా తీసుకోకూడదంటూ పూరీ చెప్పుకొచ్చారు.