1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
  4. Paisa Vasool Official Theatrical Trailer

'మేరా నామ్ తేడా - దిమాక్ తోడా' అంటున్న బాలయ్య... 'పైసా వసూల్' ట్రైలర్

'పైసా వసూల్' సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో డైలాగ్‌లతో హీరో బాలకృష్ణ ఇరగదీశాడు. మేరా నామ్ తేడా, దిమాక్ తోడా, కసి తీరకపోతే శవాన్ని లేపి మరీ చంపేస్తా అంటూ బాలయ్య చెప

Paisa Vasool Official Theatrical Trailer
'పైసా వసూల్' సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో డైలాగ్‌లతో హీరో బాలకృష్ణ ఇరగదీశాడు. మేరా నామ్ తేడా, దిమాక్ తోడా, కసి తీరకపోతే శవాన్ని లేపి మరీ చంపేస్తా అంటూ బాలయ్య చెప్పే డైలాగ్‌లు అభిమానులను అలరిస్తున్నాయి.


ఈ సినిమాలో బాలయ్య ఓ పాట కూడా పాడారు. సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు. సంగీతం అనూప్ రూబెన్స్. శ్రియ, కైరా దత్, ముస్కాన్ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ... బాలకృష్ణ స్పీడ్ చూస్తుంటే ఆయన మొదటి సినిమాలో నటిస్తున్నట్టు ఉందని చెప్పారు. వీలైతే బాలకృష్ణతో మళ్లీ ఇంకో సినిమా చేయాలని ఉందని, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు సినిమా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 
 
బాలకృష్ణ స్పీడ్ చూస్తుంటే మోక్షఙ్ఞ కన్నా చిన్నవాడిలా ఉన్నారంటూ పూరీ కితాబిచ్చారు. బాలయ్యకు బౌన్సర్లు అక్కర్లేదని, ఎందుకంటే, ఆయన అభిమానులను ఆయనే కంట్రోల్ చేయగలరని అన్నారు. 
 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అయస్కాంతం పెట్టి చూచాను... అతుక్కోవడంలేదు