గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 16 ఆగస్టు 2017 (14:30 IST)

నంద్యాలకు నటసింహం... సమయం లేదు మిత్రమా... రోజా కూడానా?

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో నంద్యాల ఉప ఎన్నికలకు జరుగుతున్న ప్రచారం గతంలో ఎప్పుడూ జరగలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకే ఒక్క నియోజకవర్గం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న హైరానా అంతాఇంతా కాదు. రెండు పార్టీల అగ్రనేతలు గత నెలరోజుల వ్యవధి

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో నంద్యాల ఉప ఎన్నికలకు జరుగుతున్న ప్రచారం గతంలో ఎప్పుడూ జరగలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకే ఒక్క నియోజకవర్గం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న హైరానా అంతాఇంతా కాదు. రెండు పార్టీల అగ్రనేతలు గత నెలరోజుల వ్యవధిలో 10 రోజుల పాటు నంద్యాలలోనే తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్ కోసం అధికార పార్టీ నందమూరి నటసింహం బాలక్రిష్ణను రంగంలోకి దిగారు. 
 
మూడురోజుల క్రితం బాలక్రిష్ణకు ఫోన్ చేసిన చంద్రబాబు నంద్యాల ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలని సూచించారట చంద్రబాబు. దాంతో రెండురోజుల పాటు బాలక్రిష్ణ నంద్యాలలో పర్యటన షురూ అయ్యింది. నందమూరి తారకరామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజలకు చేసిన సేవలను నంద్యాల ఎన్నికల ప్రచారంలో బాలక్రిష్ణ వివరిస్తున్నారు. 
 
రెండు పేజీల అతి పెద్ద స్క్రిప్టును బాలక్రిష్ణ సిద్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపొందాలన్న పట్టుదలతో అధికార తెలుగుదేశంపార్టీ ముందుకు వెళుతోంది. మరోవైపు రోజా కూడా నంద్యాలలో పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల కోసం ఆమె ఎదురుచూస్తున్నట్లు చెపుతున్నారు.