ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (16:14 IST)

థూ... ఈ బాలయ్య - లోకేష్‌ల వల్ల పరువుపోతోంది.. టీడీపీ నేతలు (Video)

తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న హీరో బాలకృష్ణల వల్ల టీడీపీకి చెడుపేరు వస్తోందంటూ వారు మథనపడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న హీరో బాలకృష్ణల వల్ల టీడీపీకి చెడుపేరు వస్తోందంటూ వారు మథనపడుతున్నారు. వీరివ్యవహారశైలి వల్ల వ్యక్తిగతంగానేకాకుండా, పార్టీ, ప్రభుత్వపరంగా పరవు పోతోందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 
 
బుధవారం రాత్రి నంద్యాలలో తాను బస చేసిన హోటల్ వద్ద ఓ తెలుగుదేశం కార్యకర్త చెంపపై హీరో బాలకృష్ణ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఎంతో కష్టపడుతూ పలు అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి, రేయింబవళ్లూ కష్టపడుతుంటే, ఇటువంటి ఒక్క ఘటనతో ఎంతో చెడ్డ పేరు వస్తోందన్నారు.
 
కీలకమైన ఉప ఎన్నికల వేళ, విపక్షాలకు మరో అస్త్రాన్ని ఇచ్చినట్టయిందని, గతంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా విడుదల రోజున ఓ అభిమానిని, ఇటీవల తన 102వ చిత్రం ప్రారంభోత్సవం రోజున తన అసిస్టెంట్‌ను బాలయ్య కొట్టిన వీడియోలు చేసిన నష్టం కన్నా, తాజా వీడియో మరింత నష్టాన్ని కలిగించేదని విశ్లేషిస్తున్నారు. 
 
ఎంతో అభిమానంతో దండ వేయడానికి వచ్చిన ఓ అభిమాని దవడను బాలకృష్ణ గొడవ పగులగొట్టారు. ఇటీవల పైసా వసూల్ చిత్ర షూటింగ్ సమయంలో కూడా చెప్పుకు బెల్టు వేయలేదన్న కోపంతో అసిస్టెంట్‌పై బాలయ్య చేయి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటన కూడా వైరల్ అయింది. 
 
ఇకపోతే.. రాష్ట్ర మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా తన ప్రసంగంలో అనేక తప్పులు మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు. వీరిద్దరి వల్ల పార్టీ పరువుతో పాటు.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా చెడ్డపేరు వస్తోందని టీడీపీ నేతలు వాపోతున్నారు.