శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (13:18 IST)

బాలకృష్ణతో సినిమా చేయలేకపోయినందుకు బాధపడుతున్నా : పూరీ

హీరో బాలకృష్ణ - డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పైసా వసూల్. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే, బాలయ్య గురించి పూరీ ఓ కామెంట్స్ చేశారు. "నేను బాలకృష్

హీరో బాలకృష్ణ - డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పైసా వసూల్. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే, బాలయ్య గురించి పూరీ ఓ కామెంట్స్ చేశారు. "నేను బాలకృష్ణ గురించి విన్నాను.. కానీ ఈ సినిమా ద్వారా ఆయన గురించి ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను. ఇంతకాలం బాలకృష్ణతో సినిమా చేయలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను" అంటూ కామెంట్స్ చేశారు. 
 
తాను బాలకృష్ణకి వీరాభిమానిగా మారిపోయానని అన్నారు. అదేవిషయాన్ని అభిమానులకు మరోమారు గుర్తు చేస్తూ, 'ఐ యామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే .. ఐ హ్యావ్ 101 ఫీవర్" అంటూ ఈ సినిమా గురించి ప్రస్తావించారు. అంతేకాదు, అచ్చు బాలకృష్ణ మాదిరిగా ఓ పోజు ఇచ్చేసి .. ఆ పోస్టర్‌ను పోస్ట్ చేసి మరింత ఆసక్తిని రేకెత్తించారు. సెప్టెంబరు ఒకటో తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.