శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (15:57 IST)

బాలకృష్ణ "పైసా వసూల్" మేకింగ్ వీడియో

నందమూరి బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పైసా వసూల్. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పైసా వసూల్. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు. 
 
ఇటీవలే విడుదల చేసిన ఈచిత్ర స్టంపర్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. స్టంపర్‌లో బాలయ్య డైలాగులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితమే స్టంపర్ మేకింగ్ వీడియోని బయటకు వదిలింది చిత్రయూనిట్. 
 
మేకింగ్ సమయంలో బాలయ్య తీసుకున్న రిస్కీ సీన్స్‌తో పొందుపరచబడిన ఈ వీడియోలో బాలయ్యబాబు స్టెంట్స్ అదిరిపోతున్నాయి. షూటింగ్ జరుగుతున్నపుడు బాలయ్య ఎనర్జీ చూసిన పూరీ అదిరింది అనడం ఈవీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.